Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హనుమకొండ ప్రతినిధి:-

హన్మకొండ జిల్లాలో రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు మహబూబాబాదు కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దీంతో కాజీపేట జంక్షనులో ఆగి ఉన్న రైల్వే ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మేల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి. కవ్వంపల్లి సత్యనారాయణ, కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైల్వే ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే ప్రయాణికులకు ఆహార ఏర్పాట్లు చేశారు. వరదలు తగ్గిన వెంటనే రైల్వే ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల పునరుద్ధరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ట్రాక్ పునరుద్ధరణపై రైల్వే అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హనుమకొండ కలెక్టరుతో పాటు ఇతర అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

Related posts

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ లో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ 

Sambasivarao

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓస్ సంఘం నాయకులు

దామెరలో వృద్దులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలు

Jaibharath News