Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆపదలో ఉన్న ప్రయాణికులకు అండగా

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
హనుమకొండ: సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైల్వే ప్రయాణికులు భారీ వర్షాల కారణంగా ఆపదలో ఉండగా అధికారులు అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉధృతికి రైల్వే లైను కొట్టుకుపోగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అధికారులు అండగా నిలిచారు. కేసముద్రం నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా కాజీపేట లోని రైల్వే స్టేషన్ కు ప్రయాణికులను తరలించారు. పలు బస్సుల ద్వారా రైల్వే ప్రయాణికులను సురక్షితంగా కాజీపేట రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు.
*రైల్వే ప్రయాణికులకు ఆహారం, నీళ్ల బాటిళ్లు, మందులు అందజేత*
కేసముద్రం నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన రైల్వే ప్రయాణికులకు హనుమకొండ జిల్లా అధికారులు ఉచితంగా ఆహారంతో పాటు నీళ్ల బాటిళ్లు, అవసరమైన వారికి మందులను అందజేశారు. రైల్వే ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం తరఫున అందిస్తున్న ఏర్పాట్లను కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పర్యవేక్షించారు. రైల్వే ప్రయాణికులు రైళ్లలో వెళ్లేంతవరకు కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన రైల్వే ప్రయాణికులు వెళ్ళగా, బెంగళూరు ఎక్స్ప్రెస్ లో అటువైపు ప్రయాణించే ప్రయాణికులు బయలుదేరారు.

*సేవలపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ అభినందనలు*

రైలలో చిక్కుకున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల ద్వారా కాజీపేట జంక్షన్ నుండి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాజీపేట జంక్షన్ వద్దకు హుటాహుటిన తరలివచ్చారు. ప్రయాణికులకు ఆహార పొట్లాలతోపాటు వాటర్ బాటిళ్లు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ అందజేశారు. రైల్వే ప్రయాణికులతో మాట్లాడి వారు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంత్రి, ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. కాగా కాజీపేట జంక్షన్ వద్ద రైల్వే ప్రయాణికులకు జిల్లా అధికార యంత్రాంగం అందిస్తున్న సేవలు పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, తదితరులు జిల్లా అధికారులకు అభినందనలు తెలియజేశారు.

రైల్వే లైన్ దెబ్బతినడంతో రైళ్ళల్లో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు తమను సురక్షితంగా రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చి, ఆహారం, నీళ్ల బాటిళ్లు, ఆరోగ్యానికి సంబంధించి మందులను అందజేయడం పట్ల అధికార యంత్రం గానికి రైల్వే ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 

Related posts

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు డైరీల బహుకరణ

Sambasivarao

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News

పోలియో చుక్కలు వేయించాలి

Jaibharath News