జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ ప్రతినిధి:- సంక్షేమ పథకాలు గురించి మాట్లాడాలంటే వై.ఎస్ కి ముందు తర్వాత అని చెప్పు కోవాల్సిందేనని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి కీ.శే వైస్సార్ 15 వ వర్ధంతి సందర్బంగా సోమావారం నాడు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పూలమాల వేసి, నివాళీలు అర్పించారు.
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల ప్రధాత అన్నదాతల ఆత్మబంధువు అందరి ముఖ్యమంత్రి వైఎస్సార్ భారతదేశంలోనే అప్పటివరకు ఎవరూ చేపట్టని సాహసయాత్ర వైఎస్సార్ చేశారు 2003లో 1,500 కిలో మీటర్ల సుదీర్ఘ యాత్ర చేపట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి, ఉచిత కరెంట్ పై తొలి సంతకం, రైతులకు ఋణాలు మాఫీ. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 2లక్షల ఆర్ధిక సాయంతో తన కార్యక్రమాలను ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం. పేదవిద్యార్థులకు ఫీజురిఎమ్మెబర్సిమెంట్ ఇచ్చి ఉన్నత విద్యకు దగ్గర చేసిన మహానేత. దాదాపు 30 లక్షల మందికి ఇండ్ల పట్టాలు,పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చిన మహానేత. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంపు మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి జలయజ్ఞం ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందించిన ఘనత వైఎస్ఆర్ అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా దూరమైనా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, అనుబంధ సంఘాల అద్యక్షులు బంక సరళ, కూర వెంకట్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బినీ లక్ష్మణ్, నాయిని లక్ష్మా రెడ్డి, నల్ల సత్యనారాయణ, తౌటం రవీందర్, హన్మకొండ్ రాజేందర్, రహీమున్నిస్సాబేగం, తాళ్ళపల్లి మేరీ, కొంటె సుకన్య, నాంపల్లి ప్రభాకర్, ఎస్ కుమార్ యాదవ్, రావుల సదానందం, మండల సమ్మయ్య, మొహమ్మద్ జాఫర్, అన్కేశ్వరపు సురేందర్, సమ్మయ్య, కృష్ణ, సమద్, సుగుణ కర్ రెడ్డి, బి యాదగిరి గౌడ్, మల్లం కుమార్, కొండా నాగరాజు, నిఖిల్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.