జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ ప్రతినిధి:-
తేలికపాటి వర్షాలకు రోడ్లపై నీళ్లు అగొద్దు. నాళాలు మూత పడేలా నిర్మాణాలు చేపట్టవద్దు.
కుడా, ఆర్&బి, ఎన్ హెచ్ అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన. తేలికపాటి వర్షాలకు సైతం ప్రధాన రహదారుల వెంట నీరు నిలువకూడదని, నాళాలు బహిరంగంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న వరంగల్ మహానగరంలో వర్షాల ప్రభావంతో చిన్నచూపు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 9 న ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బాలసముద్రం ప్రధాన రోడ్డును కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఆర్&బి ఈఈ సురేష్ బాబు, ఎన్ హెచ్ డిఈఈ కిరణ్ (నేషనల్ హై వే)కుడా ఈఈ భీమ్ రావు, పీసీసీ మెంబర్ బట్టి శ్రీనివాస్ రావు మరియు అధికారులతో పరిశీలించారు. నిర్మాణం చేపట్టే ప్రతి పనిలో శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు జరగాలని తెలిపారు. ప్రధాన రోడ్ల పక్కన ఉన్న నాళాలు(సైడ్ డ్రైన్)లు బహిరంగంగా ఉండేలా చూడాలని, దుకాణ సముదాయాల యాజమాన్యానికి కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. యుద్ధప్రాతిపదికన బిటి రోడ్డు పనులు చేపట్టాలి. పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా బిటి రోడ్డు నిర్మాణం త్వరగతిని పూర్తి చేయలని, బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయికి చేరుకుందని కోరారు. భారీ వర్షాలకు సైతం నాయిమ్ నగర్ మోరి ఆవరణలో నీరు సజావుగా సాగడం పట్ల ప్రజలకు మన ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడిందని, భవిష్యత్ లో ప్రధాన నాళాల్లో వర్షాలకు నీరు నిలువలు ఉండవని ఎమ్మెల్యే అన్నారు. బ్రిడ్జి నిర్మాణ ఆవరణలో సుందరికరణ పనులు, పాదచారులు మార్గం రెండు సమవుజ్జిగా కొనసాగించాలని కోరారు.