*భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 హనుమకొండ జిల్లా ప్రతినిధి:-
భీమదేవరపల్లి మండలంలోని భద్రకాలీ సమేత శ్రీ కొత్తకొండా వీరభద్ర స్వామి వారి 27 రోజుల నక్షత్ర దీక్ష మాల విరమణ సందర్భంగా స్వామి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. నక్షత్రమాల విరమణ సందర్భంగా వీరభద్ర స్వామి దేవాలయం నుండి ఇరుముడితో ఇతర మాలాదర స్వాములతో కాలి నడకన స్వామి వారి నామస్మరణ చేస్తూ సాహసోపేతంగా వర్షం చిరు జల్లుల మధ్య కొత్తకొండ గుట్ట పైకి ఎక్కి కుటుంబ సభ్యులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ తో కలిసి శివలింగాన్ని దర్శించు కున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి 27 రోజుల నక్షత్ర మాల విరమణ చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.