జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-
బస్సు షెల్టర్ నిర్మించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపి) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక బస్టాండ్ వద్ద నిత్యం ప్రజలు బస్సు ఎక్కడం కోసం వస్తూ, పోతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ బస్సు షెల్టరును ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు స్పందించడం లేదు. అనేకసార్లు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సుకోసంఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రజల ఇబ్బందులు గమనించి అంబేద్కర్ విగ్రహం వద్ద బస్సు షెల్టర్ నిర్మాణము చేయాలని కోరడం జరిగింది అని అన్నారు. ఈకార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంత్రి రాకేష్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.