జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 యూనివర్సిటీ ప్రతినిధి:-ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భద్రు నాయక్ కన్నుమూశారు. అతని భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేస్తున్న రిజిస్టర్ మల్లారెడ్డి. కాకతీయ యూనివర్సిటీ మాజీ చరిత్ర విభాగాధిపతి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుగులోతు భద్రు నాయక్ కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సామాజిక ఉద్యమకారులుగా అనేక జాతి ఉద్యమాలలో, హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకం వహించి ప్రోత్సాహించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన భద్రు నాయక్ అకస్మిక మృతి పట్ల చింతిస్తూ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం తెలియజేసిన దాంట్లో ప్రొఫెసర్ సురేష్ లాల్ ప్రొఫెసర్ హనుమంతు నాయక్ ప్రొఫెసర్ సమ్మయ్య వివిధ గిరిజన సంఘాలు ప్రజా సంఘాల నాయకులు బద్రి నాయక్ కి సంతాపం తెలియజేశారు.
previous post