Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్న కుడా చైర్మన్*

 

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-

 హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఇతర ప్రతిపాదిత అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సమీక్షించారు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 9వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న కాళోజీ కళా క్షేత్రం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియ, వరంగల్ బస్టాండ్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ, ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతిపాదిత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, ఆక్సిజన్ పార్క్, వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల పురోగతిపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో పాటు కుడా, మున్సిపల్, ఆర్ అండ్ బీ, సాగునీటి పారుదల, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా రెండు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జిల్లాల్లో చేపట్టిన, చేపట్టనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, నర్సంపేట ఆర్డీవోలు వెంకటేష్, కృష్ణవేణి, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

కాళోజీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కావ్య.

Sambasivarao

లా కాలేజిని మూసివేసే కుట్రలో భాగంగానే లా అడ్మిషన్ల రద్దు…..!?