Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

హర్జియా తండా లో వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 2
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని హర్జియా తండా లో  వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరం స్థానిక వైద్యాధికారి డాక్టర్ మమత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరం లో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి వారికి సంబంధించిన మందులను ఇవ్వడం అయినది.  జ్వరంతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా కిట్టు ద్వారా పరీక్షలు నిర్వహించి, రక్త నమోనాలను సేకరించడం,వారికి తగిన సూచనలు నివారణ చర్యల అవగాహన పరిసరాల పరిశుభ్రత మొదలగు ఆరోగ్య సూచనలను సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి వివరించారు. ఈ శిబిరం నందు 52 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం మలేరియా డెంగు కిట్ల ద్వారా 8 మందికి పరీక్షలు నిర్వహించడం ఇందులో ఏ ఒక్కరికి డెంగ్యూ మలేరియా నిర్ధారణ కాలేదని తెలియజేశారు. ఈ  ఉచిత వైద్య శిబిరం నందు డాక్టర్ మమత, సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎం సదాలక్ష్మి,సుహాసిని, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Related posts

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో మంత్రి సురేఖ

Sambasivarao

వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన

గృహలక్ష్మి పనులకు శంకుస్థాపన

Jaibharath News