Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత

ఆపదలో ఉన్న మిత్రునికి ఆర్థిక చేయూత
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
చిన్ననాడు కలిసి చదువుకున్న తోటి మిత్రుడికి ఆపద వచ్చిందంటే బాసటగా నిలిచి మేమున్నా మంటూ మిత్రునికి భరోసా ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. వివరాల్లో కెళ్తే ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన అన్న రవికుమార్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న 1990 -1991 ఎస్ ఎస్ సి లో చదివిన అప్పటి స్నేహితులు కలిసి రవి కుమార్ ను పరామర్శించి రు. 52,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు రవికుమార్ కు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు తోటి స్నేహితులు పాల్గొన్నారు.

Related posts

108 అంబులెన్స్ పైలెట్ పాముల రాజుకు ఉత్తమ అవార్డు

ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News