Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కందగట్ల వశిష్ట దత్త రెండవ జన్మదినం నాడు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:-ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శివనగర్ నందు చిరంజీవి కందకట్ల వశిష్ట దత్త రెండవ జన్మదినం పురస్కరించుకొని వారి తాత, నానమ్మ కందకట్ల రాంప్రసాద్ మరియు వైదేహి దంపతులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 170 మందికి నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం అమెరికాలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కోరిక మేరకు వారి తాత, నానమ్మ నిర్వహించి పిల్లల మధ్యలో వారి మనవడు జన్మదినము జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల శివనగర్ ప్రధానోపాధ్యాయులు పాత విజయకుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను అభ్యాసన సామాగ్రితో ఆదుకోవడం చాలా సంతోషమని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆ చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గందె శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమం చేయాలని ఆలోచన రావడం చాలా సంతోషమని అది కూడా ప్రభుత్వ విద్యార్థులను ప్రోత్సహించడం శుభకరమైన పరిణామం అని దీన్ని కొనసాగించాలని వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శారదా ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ గుమ్మడవెల్లి సురేష్ మాట్లాడుతూ.. రాంప్రసాద్ సేవా నేరతుని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిఆర్పి రజిని మేడం ఉపస్థితి అయ్యారు కార్యక్రమ తదనంతరం పిల్లలందరికీ నోట్ బుక్స్ తో పాటు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు సుమారు 20 వేల రూపాయల విలువైన నోట్ బుక్స్ అందించడం జరిగింది.

Related posts

పారిశ్రామిక వేత్త మాజీ సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు

మోదుగ విస్తరిలో ఎమ్మెల్యే యశస్వనీ రెడ్డి, కలెక్టర్ సత్య శారదా రేషన్ బియ్యంతో భోజనం

13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి