జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వర్ధన్నపేట ప్రతినిధి:-గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న శాసన సభ్యుల కే అర్ నాగరాజు స్థానిక నాయకులు అధికారులతో కలిసి గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా గ్రామంలోని ఏస్ సి కాలని పర్యటించి ఇండ్లలోకి నీరు చేరిన బాధితులను పరామర్శించారు. అనంతరం ఊర చెరువు కట్టను పరిశీలించి గాటేరు కాలువ, మత్తడి, తూము కాలువ పరిశీలించి అధికారులకు మరమ్మత్తు పనులు చేయాలని సూచించారు. అలాగే వర్షంవల్ల గ్రామంలో నీరు రాకుండా ఉండేందుకు కోమటికుంట వద్ద కాలువ పనులు చేయాలని కడారి గూడెం వెళ్ళే రహదారి నుంచి వచ్చే నీటిని ఎక్కడ ఆగకుండా కాలువ వెడల్పు చేసి విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చోటే, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, సీనియర్ నాయకులు గుంటి కుమారస్వామి, గడ్డం సమ్మయ్య, మల్లెమాక సమ్మయ్య, కార్యదర్శి రామారావు గ్రామ పంచాయితీ పాల్గొన్నారు.