Jaibharathvoice.com | Telugu News App In Telangana
కాకినాడ

పోస్టుకార్డుల ఉద్యమం

జై భారత్ వాయిస్ న్యూస్  కాకినాడ రూరల్ వలసపాకల ఆగస్టు 03  
కాకినాడలో విలీనం జరిగిన 8గ్రామాల దస్త్రాలను ప్రభుత్వ ఆదేశాలతో కార్పోరేషన్ కు తీసుకువచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి పౌరసంక్షేమసంఘం పిలుపుతో చేపట్టిన పోస్టుకార్డుల ఉద్యమం మరో పదిహేను రోజులు పాటు జరుగుతుందని సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు తెలిపారు. తూరంగి నుండి 330 ఇంద్రపాలెం నుండి 360 రమణ య్య పేట నుండి 423 వాకలపూడి నుండి 290 వలసపాకల నుండి 189 చీడిగ నుండి 310 పోస్టు కార్డులపై ప్రముఖులు స్థానికులు సంతకాలు చేసి ప్రింటెడ్ పోస్టు కార్డు పై అయిదు రూపాయల స్టాంప్ అంటించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు పంపించారని తెలిపారు. సిటీలో కూడా సంతకాలు చేయించి అన్ని వర్గాల అభిప్రాయాలను సమీకృతం చేస్తున్నా మన్నారు. పది వేల పోస్టు కార్డులు ప్రజల భాగస్వామ్యంతో పంపించే ఏర్పాటు చురుగ్గా జరుగుతున్న దన్నారు. సెప్టెంబర్ మూడవ వారంలో జిల్లా కేంద్రం నందు భారీ సదస్సు ఆఖరివారంలో సిఎం క్యాంప్ కార్యాల యానికి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా పౌర సంఘం విలీనం పరిష్కారంపై జూలై 7నుండి చేపట్టిన వందరోజుల కార్యాచ రణ పూర్తిచేయడం జరుగుతున్నదన్నారు.ఉద్యమంలో మాజీ సర్పంచులు సభ్యులు అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల కాలనీ ప్రతినిధుల తోడ్పాటు వుందని రమణరాజు వివరించారు.

Related posts

మరిడమ్మతల్లి ఉత్సవం తెలుగింటి ఆషాఢ ఆచారం

ఇస్కాన్ కృష్ణాష్టమి పోటీల్లో..రాజరాజేశ్వరిగా అలరించిన మాధుర్య సాయి

సూర్యారావుపేటలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ సంస్థ సమావేశం