జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వర్ధన్నపేట ప్రతినిధి:-వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి నిన్న రాత్రి పారిస్ లో జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలవడంతో కాంస్య పతకం సాధించి ఓలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించి కాంస్య పతకం సాధించిన సందర్భంగా ఆమెకి అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. మన ప్రజా ప్రభుత్వంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ప్యారిస్ లో జరిగిన ఒలంపిక్ అథ్లెట్ లో దీప్తి జీవాంజి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడం యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రనికి ఉమ్మడి వరంగల్ జిల్లాకే గర్వకారణం అని ఎమ్మెల్యే తెలియజేశారు.

next post