Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయులకు మంత్రి సురేఖ శుభాకాంక్షలు

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 హైదరాబాద్ ప్రతినిధి:-
విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు (సెప్టెంబర్ 5) ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా మంత్రి సురేఖ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, అలాంటి విద్యను అందించడంలో నిమగ్నమైన ఉపాధ్యాయులందరూ స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. ఒక సమర్థుడైన గురువు మాత్రమే తనలాంటి సమర్థులైన గురువులను తయారుచేయగలడనీ, దేశగమనాన్ని మార్చగల శక్తి అలాంటి గురువులకే ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు గాను విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ఈ కమిషన్ పనితీరుతో రాష్ట్ర విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

నూతన దంపతులను నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్ అశీర్వదించారు

దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసి తీసుకువస్తాం సిఎం రేవంత్ రెడ్డి

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News