జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 హనుమకొండ ప్రతినిధి:-
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, కాజిపేట ఫాతిమా నగర్ పారీష్ కౌన్సిల్ & మథర్ థెరిసా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత మాథర్ థెరిసా 27వ వర్ధంతి మరియు 8 వ పునీత పట్ట వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మథర్ థెరిసా విగ్రహానికి పూలమాల వేసి, నివాళీలు అర్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పిఠాధిపతి మహా పూజ్యా డా. ఉడుముల బాల. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నివేల కోట్లు ఉన్న సమాజ సేవచేసే తత్వం లేకుంటే బ్రతికిన వృదానే,మథర్ థెరిసా లాంటి మహోన్నతమైన మాతృమూర్తి కదలాడిన నేలపై మనలో మార్పు రాకుంటే వృధా అని భావిస్తున్న. భవిష్యత్ తరాలకు హింస మార్గాలలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, మథర్ థెరిసా ఎంచుకున్న మార్గంలో రాబోవు తరాలు నడవాలని కోరుకున్నారు. మథర్ థెరిసా సేవ, జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురణ చేసి విద్యార్థులకు బాల్య దశలోనే అభ్యసించేలా చేయాలని కోరారు. ప్రపంచంలో కల్మషంలేని ప్రేమ తల్లిది మాత్రమేనని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరినని, అటువంటి తల్లి పేరును ముందుగా పలుకుతూ మథర్ థెరిసా అని పిలుస్తున్నమాని గుర్తు చేశారు.12 ఏళ్ల వయసులోనే సేవ భావాన్ని కలిగి నిరుపేద, అనాధ పిల్లలకు అండగా ఉన్నటువంటి మథర్ థెరిస్సా వేడుకలో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. ఫాతిమనగర్ మథర్ థెరిసా విగ్రహ స్థలంలో ఉన్న పార్క్ అన్యాక్రాంత్యానికి గురైందని దృష్టికి తీసుకుని రావడంతో తక్షణమే కుడా, ఎంహెచ్ఓ అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేని మత పెద్దలు, నిర్వాహాక కమిటీ సభ్యులు అందరు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గురువులు, మఠకన్యాలు,నగర ప్రముఖులు పాల్గొన్నారు.