జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వర్ధన్నపేట ప్రతినిధి:- వర్ధన్నపేట మండలంలోని, దివిటిపెల్లి గ్రామములో పాఠశాలలో సర్వేపెల్లి రాధాకృష్ణ గురుపూజోత్సవం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కొండేటి మధుకర్, ఎస్సీ సెల్ మండల అధికార ప్రతినిధి కందిక ఏళ్లస్వామి ఉపాధ్యాయలు నిర్వహించారు ఈ సందర్భంగా మధుకర్, ఏళ్ళాస్వామి మాట్లాడుతూ ఈ ప్రపంచములో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృతే అందుకే ఆ వృత్తి అంటే ఎంతో గౌరవం మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏ పి అబ్దుల్ కలామ్. ఈశ్వరునికి చేసిన సేవ గొప్పదా? గురువుకు చేసిన సేవ గొప్పదా? అన్న ప్రశ్న వేస్తే గురువుకు చేసిన సేవే గొప్పది అని ఎన్నో సార్లు భగవంతుడు నిరూపించాడని అన్నారు. .ఈ కార్యక్రమములో పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

previous post