జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 పరకాల ప్రతినిధి:-పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. వివిధ పాఠశాలలో శారద స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, చైతన్య మోడల్ స్కూల్, ప్రభుత్వ హైస్కూల్, సి ఎస్ ఐ స్కూల్, ఆత్మకూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించడం మన బాధ్యత అన్నారు చిన్ననాటి నుండి ఉపాధ్యాయులు చెప్పే బాటలో నడవడం ద్వారా మనము ఉన్నత స్థాయికి వెళ్తామని అన్నారు విద్యార్థి చిన్ననాటి నుండే స్కూల్లో గాని కాలేజీలో గాని ఉపాధ్యాయులు చెప్పే చదువు మరియు క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకు వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ పట్టణ కార్యదర్శి సాయి తేజ పాల్గొన్నారు.

previous post