Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వరంగల్ ప్రతినిధి:- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ శివనగర్  ప్రభుత్వ ఉన్నత పాఠశాల     ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్యపేడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గట్టు మహేష్ బాబు జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు ప్రధాన కార్యదర్శి గుమ్మడవెల్లి సురేష్ మహిళా అధ్యక్షురాలు వల్లాల శైలజ, పూర్ణ   ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ గురువు లేకుండా జీవితం కొనసాగదని అలాంటి గురువుకు విశిష్టమైన స్థానం ఉందని అలాంటి గురువులను సన్మానించుకునే సదవకాశం కల్పించినందుకు  సంతోషిస్తున్నామని పేర్కొన్నారు జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పింది విద్యార్థులు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తద్వారా బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని హితోపలికారు ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ విద్య యొక్క ఆవశ్యకత విద్యార్థి పాత్రను  వివరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గందె శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మేము కోరగానే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్వర్యంలో  పాఠశాలకు చెందిన 15 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారని తెలిపారు

Related posts

జాతీయ స్థాయి యోగా పోటీలకు అభినవ నేతాజీ ఎంపిక

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.మండల ప్రత్యేక అధికారి డి.సురేష్.

కాంగ్రెస్ రైతు రుణమాఫీ పెద్ద మోసం!!