జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 వరంగల్ ప్రతినిధి:- గ్రేటర్ వరంగల్ నగరంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన ఎన్ ఎన్ నగర్, డీకే నగర్, మైసయ్య నగర్, బాధితులకు నిత్యవసర వస్తువుల సరుకులతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ వరదల కారణంగా ముంపుకు గురైన బాధితులకు తాత్కాలిక ఉపశమనం చేకురిచే కార్యక్రమాలు కాకుండా వరదలు రాకుండా నిపుణులతో సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబాలు ఎవరూ బాధపడొద్దు మీకు ఎల్లప్పుడూ అండగా కొండా దంపతులు ఉంటారని భరోసా కల్పించారు లేబర్ కాలనీలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు బాల్యమిత్రుడు అనారోగ్యంతో బాధపడుతుండగా మంగళవారం వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు
19 డివిజన్ కాశీబుగ్గలోని శివాలయాన్ని సందర్శించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ శివాలయానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కాశిబుగ్గ బతుకమ్మ బండ్ ఆక్రమానకు గురైన స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు బతుకమ్మ బండ్ స్థలాన్ని కబ్జాకు చేస్తే చేసిన వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
previous post
next post