April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం గ్రామంలో   ఉచిత వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ధర్మారం గ్రామంలో  గురువారం ఉచిత వైద్య శిబిరం  ఆంటీ లార్వల్ ఆపరేషన్,స్ప్రే నిర్వహించడం జరిగినదని వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణ పరిసరాల పరిశుభ్రత వర్షాకాలంలో దోమల పెరుగుదల వలన సంభవించు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మొదలగు సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్ర పరుచుకుంటూ దోమల పెరుగుదలను అరికట్టు చర్యల పై అవగాహన జ్వరం వచ్చిన వెంటనే స్థానిక వైద్య సిబ్బంది నీ సంప్రదించి తగిన మందులను  వారు ఇచ్చే  సూచనలను పాటించుచు వ్యాధుల నివారణను నియంత్రించుకోవచ్చని తెలిపారుఈ వైద్య శిబిరంను   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి. మధుసూదన్ రెడ్డి పర్యవేక్షించారు
ఈ  వైద్య శిబిరంలో 62 మందికి పరీక్షలు నిర్వహించి, డెంగ్యూ మలేరియా కిట్టుల ద్వారా 8 మందికి  పరీక్షలు నిర్వహించడం జరిగినదని తెలియజేశారు.  ఈ వైద్య శిబిరంలో  స్థానిక వైద్యాధికారి డాక్టర్ నేహా,సూపర్వైజర్లు కిరణ్,పద్మావతి, హెల్త్ అసిస్టెంట్ రఘు ప్రసాద్,    ఏఎన్ఎంలు వినోద, కవిత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కార్యదర్శిల ఫోరం అధ్యక్షుడుగా రామారావు ఎన్నిక

సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

Jaibharath News