*తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండ సురేఖ*
హైదరాబాద్
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వరంగల్ జిల్లా ప్రతినిధి:-
రాష్ట్ర ప్రజలకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక ప్రపంచానికి గణేషుడు ప్రథమ పూజ్యుడని మంత్రి సురేఖ అన్నారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భక్తులు వినాయకుడిని పూజిస్తారని మంత్రి సురేఖ పేర్కొన్నారు. వినాయకుడు ఈ లోకాన్ని రక్షించేందుకుగాను ఏకదంతుడు, లంబోదరుడు, మహోదరుడు, వక్రదంతుడు, దూమ్రవర్ణుడు, వికటుడు, గజాననుడు, విఘ్నరాజుగా ఎన్నో అవతారాలెత్తాడని మంత్రి సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యేడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సురేఖ తెలిపారు. ప్రకృతి హితాన్ని కోరే వినాయక చవితి పండుగను పర్యావరణహిత గణపతుల ప్రతిమలను ప్రతిష్టించి పండుగకు సార్థకతను చేకూర్చాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి చేపట్టే కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.