*అనాధ బాలికకు అండగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేట నియోజకవర్గం//కోనాపురం
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 వర్ధన్నపేట ప్రతినిధి:-
తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన బాలికను పరామర్శించిన ఎంపీ
బాలికకు అన్నీ విధాలా అండగా ఉంటానని హామీ. వర్దన్నపేట మున్సిపాలిటీ కేంద్రం కోనాపురంకు చెందిన ఎలికట్టే భాస్కర్ విద్యుత్ షాక్ తో మరణించగా, స్వరూప అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుమార్తె అనాధగా మారిన విషయం తెలుసుకున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వారి నివాసనికి వెళ్లి బాలికను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనాధగా మారిన బాలిక బాగోగులు చూసుకునేందుకు ఐసిడీఎస్ అధికారులతో మాట్లాడిన ఎంపీ పాప బాధ్యతను ప్రభుత్వంమే చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనాధగా మారిన బాలికకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాలికకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని బంధువులకు సూచించారు. భవిష్యత్తులో బాలికకు ఏవిధమైన సహాయ సహకారాలు అవసరమైన అండగా ఉంటానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.