*బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం*
హన్మకొండ జిల్లా//శాయంపేట
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 పరకాల ప్రతినిధి:-
శాయంపేట మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలుర పాఠశాలలో విద్యార్థులందరికీ బాసని సుదర్శనం జ్ఞాపకార్థం వారి భార్యా పిల్లలు భాషని అరుణ సృజన చైతన్యలచే వారి తరఫున వారి సోదరుడు భాషను సుబ్రహ్మణ్యం విద్యార్థులందరికీ బూట్లను ప్రధానం చేసినారు. ఈ సందర్భంగా భాషను సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తమ పాఠశాలకు ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పద్మ సదానందం హాజీముద్దీన్ ఉదయ్ సత్యప్రసాద్ రాజేష్ శర్మ విద్యార్థులు పాల్గొన్నారు.