జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
తెలంగాణ ఉద్యోగ,గెజెట్టెడ్ అధికారుల,ఉపాధ్యాయ ,పెన్షనర్ల జేఏసీ నేతలపై లచ్చిరెడ్డి చేసిన ఆరోపణల్ని
తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ టీచర్స్ పెన్షన్ ఔట్సోర్సింగ్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వరంగల్ జిల్లా చైర్మన్ గజ్జెల రామ్ కిషన్
ఖండించారు. ఇటీవల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు (205) భాగస్వామ్య సంఘాలతో ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే.. జేఏసీ స్టీరింగ్ కమిటీ అన్ని భాగస్వామ్య సంఘాల ఉమ్మడి నిర్ణయం మేరకు తెలంగాణ లో ఇటీవల తుఫాను బీభత్సం వల్ల ప్రజలు ధన, ప్రాణ, పశు పక్ష్యాదుల జీవితాలు తీవ్ర నష్టాలకు చవిచూసిన సందర్భంలో ఉద్యోగ వర్గంగా సహాయాన్ని అందించడం కోసం ఒకరోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తూ ప్రకటించడాన్ని యావత్తు ఉద్యోగ లోకం స్వాగతించిందని ఆయన అన్నారు
కానీ కొందరు స్వార్ధపరులు ఉద్యోగ వర్గానికి ద్రోహం చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ స్వయం ప్రకటిత జెఎసి చైర్మన్ (అస్సలు ఆయన వెనుక సంఘాలు లేని)లచ్చి రెడ్డి నాయకత్వంలో కొంతమంది వ్యక్తులుతెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ మీద చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు లచ్చి రెడ్డి గ్రూపు చేసే ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని గజ్జెల రామ్ కిషన్ తో పాటు కేంద్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు , జిల్లా కార్యదర్శి గాజ వేణుగోపాల్ భాగస్వామ్య సంఘాల కన్వీనర్ లు పేర్కొన్నారు.
next post