(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
యువతి యువకులందరూ రక్తదానం చేసి ప్రమాదాల్లో గాయపడ్డ వారి ప్రాణాలను కాపాడాలని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలం కేంద్రానికి చెందిన ఇనగాల వెంకట్రాంరెడ్డి జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కి ఆత్మకూర్ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత పర్వతగిరి రాజు ఆధ్వర్యంలో మహా రక్తదానాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరూ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానాన్ని చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుండె బోయిన శ్యామ్ చిమ్మని దేవరాజ్, బయ్య కుమారస్వామి, తనుగుల సందీప్,వడ్డేపల్లి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post