*ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని*
హన్మకొండ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-
మట్టి గణపతులతో ఈ నవరాత్రి ఉత్సవాలు మరింత భక్తి శ్రద్దలతో కొనసాగాలని కోరిన ఎమ్మెల్యే. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని.కుల, మతాలకు అతీతంగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో 9 రోజులు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అందరికీ మంచి జరగాలని, విజ్ఞాలు లేకుండా ఆ విజ్ఞానాథుడు చూడాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ మరియు తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు హనుమకొండ ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం)లో మట్టి గణపతి లను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.