*వేయి స్తంభాల గుడిలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి*
హన్మకొండ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-
శ్రీ రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంబాలదేవాలయములో నిర్వహిస్తున్న శ్రీ ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకుని, దేవా యంలో కొలువు తీరిన గణపతి స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే విఘ్నేశ్వరుడి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని శాలువతో సన్మానించి, ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నవారాత్రి ఉత్సవాల్లో మహా గణపతి దివ్యశీస్సులు అందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, ప్రతియేటా దేవాలయంలో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ నేతృత్వంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్ననాని అన్నారు. ప్రజలందరూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఉత్తిష్ఠ గణపతి(మూల వరులకు)జరుగు సేవలను తరించాలని పేర్కొన్నారు. అనంతరం హనుమకొండ అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలోని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.