*గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల సమస్యలను పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ వర్ధన్నపేట*
వరంగల్ జిల్లా//వర్ధన్నపేటజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 వర్ధన్నపేట ప్రతినిధి:-
వర్ధన్నపేట మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఎస్ఎఫ్ఐ వర్ధన్నపేట మండల కార్యదర్శి ఇస్లావత్ కళ్యాణ్ అధ్యక్షతన సందర్శించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ వర్ధన్నపేట మండలంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలతో విలయ తాండవం చేస్తుంది విద్యార్థులకు సరిపడా బాత్రూంలో ఉన్నప్పటికీ వాటికి డోర్లు లేకపోవడం చాలావరకు బాధాకరం అని అన్నారు అదేవిధంగా సెప్టిక్ ట్యాంకు లేకపోవడం వలన కూడా విద్యార్థులకు చాలా వరకు వర్షాకాల ప్రభావానికి వ్యాధులకు గురై అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి సెప్టిక్ ట్యాంకు నిర్మించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రమ్య, ఐశ్వర్య, సృజన తదితర విద్యార్థులు పాల్గొన్నారు.