Jaibharathvoice.com | Telugu News App In Telangana
జనగామ జిల్లా

జఫర్గడ్ లో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహావిష్కరణ చేసిన కడియం శ్రీహరి

*జఫర్గడ్ లో మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహావిష్కరణ చేసిన కడియం శ్రీహరి*

జనగామ జిల్లా// గా స్టేషన్ ఘణపూరు నియోజకవర్గం// జఫర్గడ్
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 హనుమకొండ ప్రతినిధి:-

జఫర్గడ్ లో మహారాణ ప్రతాప్ సింగ్ విగ్రహావిష్కరణ చేసిన కడియం శ్రీహరి. ధైర్యా సాహసలకు, పరాక్రమానికి మారుపేరు. అలాంటి గొప్ప వీరుని విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాజ్ పుత్ వంశస్తులందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. జఫర్గడ్ మండల కేంద్రంలో బొందిలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజ్ పుత్ వంశస్తులతో కలిసి మహారాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశం గర్వించదగ్గ మహా వీరులలో మహారాణా ప్రతాప్ సింగ్ ఒకరని అన్నారు. తాను పాఠశాలలో చదువుకునే సమయంలో మహారాణా ప్రతాప్ సింగ్ చరిత్రను పాఠ్యంశంగా నేర్చుకున్నాని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ ప్యాలెస్ పైన 1000 సంవత్సరాల మేవార్ వంశస్తుల చరిత్ర లిఖించబడి ఉందని వివరించారు. తాను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరుగా పనిచేస్తున్న సమయంలో విద్యార్థులతో కలిసి ఉదయ్ పూర్ ప్యాలెస్ ను సందర్శించినట్లు తెలిపారు. మేవార్ వంశస్తులలో ప్రముఖమైన వ్యక్తి మహారాణా ప్రతాప్ సింగ్ అని వెల్లడించారు. అంతగొప్ప చరిత్ర కలిగిన మేవార్ రాజ్ పుత్ వంశస్తులకు అభినదనలు తెలియజేశారు. త్వరలోనే మహారాణా ప్రతాప్ సింగ్ కమ్యూనిటీ హల్ నిర్మాణం చేసుకుందామని హామీ ఇచ్చారు. అలాగే మండల కేంద్రంలోని లక్ష్మినరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ ఏర్పాటు చేసుకొని కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. గొప్ప చరిత్ర కలిగిన జఫర్గడ్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జఫర్గడ్ పెద్ద చెరువును రిజర్వాయర్ చేయడానికి ఇప్పటికే 6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే జఫర్గడ్ మండల కేంద్రంలో నాలుగు లైన్ల రోడ్డుగా మార్చి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతునట్లు తెలిపారు. మండల పరిధిలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, మీ అందరి సహకారంతో మండలాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రాజ్ పుత్ వంశస్తుల కోరిక మేరకు అవసరమైతే హన్మకొండలో మహారాణా ప్రతాప్ సింగ్ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రాజ్ పుత్ వంశస్తులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జనగామ అభివృద్ధిపై సిపిఎం జిల్లా ప్రతినిధి బృందంతో చర్చించిన జనగామ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర్ రెడ్డి

దరఖాస్తు గడువు పొడిగింపు

Jaibharath News

జఫర్ గడ్. మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Sambasivarao