*ఉప్పరపల్లి క్రాస్ రోడ్ నుంచి రాయపర్తి మండలం కిష్టాపూర్ క్రాస్ రోడ్ వరకు ప్రమాదాల నివారణకు తగు చర్యలకు సూచన*
వరంగల్ జిల్లా// వర్ధన్నపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వర్ధన్నపేట ప్రతినిధి:-
గత కొన్ని రోజులుగా ఎన్ హెచ్ -563 పై రోడ్డు ప్రమాదాలు అవుతుండగా ఇట్టిరోడ్డు ప్రమాదాల నివారణ కొరకై ఈరోజు వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ నుండి రాయపర్తి మండలం కిష్టాపూర్ క్రాస్ రోడ్ వరకు ఎక్కడెక్కడ రోడ్డు మూలమలుపుల వద్ద ప్రమాదకరంగా ఉంది, వర్షాల వల్ల రోడ్డు ఎక్కడ గుంతలు పడేలా ఉన్నాయని పరిశీలించి, రోడ్డు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని, ప్రమాదాల నివారణ కొరకు రంబుల్ ట్రిప్స్ మరియు బారికేడ్స్, సోలార్ బ్రింకింగ్ లైట్స్ వేయించాలని ఎన్ హెచ్ ఫై రోడ్డు ప్రమాదాలను నివారించాలని వర్ధన్నపేట సీఐ కే శ్రీనివాసరావు, టిటిఐ సి.ఐ బి శ్రీనివాసరావు, వర్ధన్నపేట ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్, రాయపర్తి ఎస్ఐ కే శ్రవణ్ కుమార్ మరియు ఎన్ హెచ్ ఎ ఐ ఏఈ మదన్ రోడ్డును పరిశీలించి పలు సూచనలు చేస్తూ సిఫార్సు చేయనైనది.