*15 రోజులకు చేరిన ఆమరణ దీక్ష క్షీణిస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే ఆరోగ్యం*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండల కేంద్రం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:-
సంఘీభావం తెలిపిన వివిధ ప్రజాసంఘాల నాయకులు.
ప్రభుత్వం స్పందించి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్. లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక.
తెలంగాణ ప్రభుత్వం కుల జనగణన చేసి,బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్ష ఆదివారంతో 15వ రోజుకు చేరుకుంది. దీంతో చాపర్తి కుమార్ గాడ్గే ఆరోగ్యం డిపి లెవెల్ షుగర్ లెవెల్ పడిపోయాయి. దీక్షా శిబిరాన్ని సీపీయూఏస్ ఐడిబిఏస్ వి వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరత్, జిల్లా నాయకుడు జన్ను అనిల్ కుమార్, రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ పిట్టల రాజమొగిలి, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేడల ప్రసాద్, డిబీఎఫ్ జిల్లా అధ్యక్షుడుమాదాసి సురేష్, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు తెలంగాణ కొమురయ్య, బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మపురి రామారావు, తీన్మార్ మల్లన్న టీమ్. పాలకుర్తి ఇంచార్జ్ గుంటుక నవ్య, తీన్మార్ మల్లన్న టీము సభ్యుడు మహంకాళి రాజుసందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజులుగా ఆమరణ దీక్ష చేయడం వలన చాపర్తి కుమార్ గాడ్గే ఆరోగ్యం బాగా క్షణించిందని బిపి, షుగర్ లెవెల్ పడిపోయాయని ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి కామారెడ్డిలో ప్రకటించిన బిసి డిక్లరేషన్ అమలు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేసి దీక్షను విరమింప జేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సామాజిక, దళిత, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలను కూడగట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.