జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య హనుమకొండ వరంగల్ జిల్లా స్థాయి కార్యవర్గ ఎన్నికలు ఆదివారం పోతన విజ్ఞాన పీఠం వరంగల్ యందు రాష్ట్ర అధ్యక్షులు ఆకుల సదానందం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజీపేట తిరుమలయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరి బాలాజీ పర్యవేక్షణలో జరిగినవి. ఎన్నికల ఫలితాలు నాటక సమాజముల సమాఖ్య
వరంగల్ జిల్లా అధ్యక్షులుగా మాడిశెట్టి రమేష్, ప్రదాన కార్యదర్శిగా ఆకుతోట లక్ష్మణ్ కోశాధికారిగా వనపర్తి రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా చిన్నబోయిన రాందాస్, కుసుమ సుధాకర్, చొక్కం శ్రీనివాస్ సిరిసే రాజేశ్వరావు,ఆర్గనైజింగ్ సెక్రటరీ తాటికొండ లక్ష్మణమూర్తి, జాయింట్ సెక్రటరీగా జూలూరి నాగరాజు గట్ల భిక్షపతిప్రచార కార్యదర్శిగా మాలి విజయరాజ్ కార్యవర్గ సభ్యులుగా, ఏనుగు నారాయణ, గోదాసి అశోక్ కుమార్ కర్రే శంకర్ , గౌరవ సలహాదారులుగా జే నాగమనీంద్రశర్మ, వేముల ప్రభాకర్, శతపతి శామలరావు,యన్. యస్. ఆర్. మూర్తి ఎన్నికైనారు. ఈ సందర్భంగా వరంగల్,హనుమకొండ జిల్లాలోని పలువురు కళాకారులు ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.