జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 హనుమకొండ ప్రతినిధి:-హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఖో ఖో బాల బాలికల ఎంపిక పోటీలలో జడ్పీఎస్ఎస్ బాయ్స్ నర్సంపేట పాఠశాలలో 8 వ తరగతి చదువుచున్న అభినవ్ , ఏడవ తరగతి చదువుచున్న ఎడ్ల ఉదయశ్రీలు తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనట్లు బాయ్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొర్ర సారయ్య తెలిపారుఈ రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలు ఖమ్మం జిల్లాలోని కల్లూరు లో ఈనెల 15 నుండి 18 వరకు జరుగుతాయని పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ కోట రాంబాబు తెలిపారు. రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనా ఉదయశ్రీ అభినవ్ లను వారికి శిక్షణ ఇచ్చిన పిఈటీ కోట రాంబాబుని నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య అభినందిస్తూ వీరి రాష్ట్ర స్థాయికి వెళ్లడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందించారు క్రీడాకారులను ఉపాధ్యాయులుఎల్ రమేష్, జి శ్రీనివాస్,అబిదతబస్సుమ్, డి రమేష్,ఎం రమేష్, ఎస్ ఉమామహేశ్వర్, పి రవికుమార్, గోపాల్ రావు, బిక్షపతి, బుచ్చి రాములు, బాల, శైలజ, వీరస్వామి అభినందించారు.