జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ శంభునిపేటలోని గిరిప్రసాద్ నగరులో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బోరిగం (దుబాయ్ ) శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మహా అన్నధాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ గణేశుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం భోజనాలు వడ్డీంచి ప్రజలతో కలిసి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక పెద్దలు ఎండీ ఉల్ఫాత్, రంజిత్, నరేష్, యాదగిరి, శ్రీనులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

next post