Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలోనికి వెళ్ళాలి అంటే బురదలో నడుచుకుంటూ వెళ్ళల్సిందేనా…???

భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వద్దన్నపేట ప్రతినిధి:-వర్షాలు పడుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు, రోగుల బంధువులు. మున్సిపాలిటీ అధికారులు ఆస్పత్రి ముందు డ్రైనేజీ నిర్మించక పోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని  ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్య గురించి తెలిపినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు.  మున్సిపాలిటీగా మారినప్పటి నుండి కోట్లు ఖర్చుపెట్టీ అభివృద్ధి చేసినం అని చెప్పుకుంటున్న పాలకవర్గం అధికారులు. మరి ఈ సమస్య ఏంటని నిలదీస్తున్న పట్టణ ప్రజలు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆస్పత్రి ఇరుపక్కల డ్రైనేజీ కాలువ నిర్మించి నీరునిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు, రోగులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని దాసరిహరి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

Sambasivarao