సెప్టెంబరు 10 : జై భారత్ వాయిస్ ‘ మండలంలోని గోగులంపాడు గ్రామంలో అటుగా వెళ్తున్న కాన్వాయిని ఆపి గొర్రెల కాపరులను పలకరిస్తూ వారి యొక్క యోగక్షేమాలను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి గారు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 3 వేల గొర్రెలు ఉన్నాయని గొర్రెల కాపరులు కె, శ్రీనివాసరావు, జె, గురునాథ్ రావు, సి,ఎచ్, వీరయ్య మంత్రివర్యుల దృష్టికి తీసుకువస్తూ నట్టల వ్యాధి నివారణకు టీకాలు ఇప్పించి తమను ఆర్ధికంగా ఆదుకోవాలని కోరగా దీనిపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి గారు స్పందిస్తూ జిల్లా కలెక్టర్ వారికి, పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ తో ఫోన్ మాట్లాడి గొర్రెల్లో నట్టల వ్యాధి నివారణకు అవసరమైన మందుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గొర్రెల కాపరులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి మంత్రి భరోసా ఇచ్చారు.