*శాయంపేటలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు*
హనుమకొండ జిల్లా// శాయంపేట మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 పరకాల ప్రతినిధి:-
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వీర వనిత చాకలి ఐలమ్మ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టిచాకిరీ విముక్తి కొరకు జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో దొరలు, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేత పట్టి నిజాం సర్కార్‌తో పాటు విస్నూర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతిని, జయంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు.