May 8, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సర్పంచ్ ఏకగ్రీవం సొంత పైసలతో బొడ్రాయి పండగ. ఇంటింటికి రూ. 1000

*సర్పంచ్ ఏకగ్రీవం సొంత పైసలతో బొడ్రాయి పండగ. ఇంటింటికి రూ. 1000*

వరంగల్ జిల్లా//చెరువు కొమ్ము తండా
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 నర్సంపేట ప్రతినిధి:-

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవమయ్యాడు. సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి పండగ, మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి ఖర్చు కోసం ఇంటింటికి రూ.1000 చొప్పున పంచుతానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. అందుకుగానూ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా, తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్పెట్టాడు. అయితే మాట తప్పితే ఎలా అని గ్రామస్థులు బాలాజీని ప్రశ్నించడంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తిచేస్తానని మాట ఇచ్చాడు బాలాజీ. దీంతో ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టుకుని అగ్రిమెంట్పేపర్ రాసుకున్నారు. ఒప్పందం ప్రకారం. గడువులోగా పనులు పూర్తయితే బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలి. దీనిని ఒకవేళ ఎవరైనా అతిక్రమించి నామినేషన్ వేస్తే. బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంటులో రాసుకున్నారు. అగ్రిమెంటుపై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని, వేడుకలు చేసుకున్నారు.

Related posts

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News

పత్రికా విలేకరిని చంపుతా అని బెదిరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి*

Sambasivarao

నేడు మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి

Jaibharath News
Notifications preferences