January 9, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణ రాష్ట్ర పిఆర్టీయు గీసుకొండ మండల శాఖ సర్వసభ్య సమావేశం

*తెలంగాణ రాష్ట్ర పిఆర్టీయు గీసుకొండ మండల శాఖ సర్వసభ్య సమావేశం*

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//ధర్మారం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వరంగల్ ప్రతినిధి:-

గీసుకొండ మండలంలోని ధర్మారం హైస్కూల్లో పీఆర్టీయు సర్వసభ్య సమావేశం జరిగింది. గీసుకొండ మండల శాఖ అధ్యక్షులు కల్లూరి వేంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తామని, మోడల్ స్కూల్ టీచర్స్ కు 010 పద్దు ద్వారా జీతాలు ఇప్పిస్తామని, కేజీబీవీ టీచర్స్ కు టైం స్కేల్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని, అన్ని యాజమాన్యఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని మరియు పిజీహెచ్ఎం ప్రమోషన్స్ ఇప్పిస్తామని, 2003 డి.ఎస్.సి వారికి పాత పెన్షన్ అమలు అయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కల్లూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా మార్త శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులుగా బొల్లం రవి, ఎన్ ఇందిరా దేవి, ఉపాధ్యక్షులుగా ఎన్ మాలతి, ఎం బాలరాజు, కార్యదర్శులుగా జి పద్మజ, ఎం స్వాతి ఎన్నికయ్యారు. ఈ కార్యక్ర మానికి జిల్లా అధ్యక్షులు ఈదునూరీ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గఫార్, మాజీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సూరం శంకర్ రావు, తమ్మి దయాకర్, పత్రికా సంపాదక సభ్యులు రాజు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభి, నల్లబెల్లి మండల అధ్యక్షులు మహేందర్, దుగ్గొండి మండల మాజీ అధ్యక్షులు సుధాకర్, స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు రఘు మండల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు హాజరైనారు. ఎన్నికల పర్యవేక్షకులుగా సంగెం మండల అధ్యక్షులు, ప్రథాన కార్యదర్శి విజయ్, రాజేందర్, వ్యవహరించారు.

Related posts

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త అకాల మృతి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించిన బాలకిషోర్ రెడ్డి

Sambasivarao

mrps మాదిగల మహాగర్జన విజయవంతం చేయండి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శఠగోపం బహుకరణ

Jaibharath News
Notifications preferences