Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు

*ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు*

వరంగల్ జిల్లా//చెన్నారావుపేట మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 నర్సంపేట ప్రతినిధి :-

స్థానిక చెన్నారావుపేట మండల కేంద్రంలోనీ జాగృతి విద్యానికేతన్ స్కూల్లో ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. అనంతరం ఎంసిపిఐయూ పార్టీ చెన్నారావుపేట మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ తత్వానికి పటేల్ పట్వారి పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ వెట్టి చాకిరి చేపిస్తున్న క్రమంలో విసునూరు దొర కౌలు రైతులపై చేస్తున్న అన్యాయాలపై ఎదురు తిరిగిన వీర వనిత చాకలి ఐలమ్మ. దున్నేవాడిదే భూమి అంటూ ప్రజలను వెట్టి చాకిరి విముక్తి నుండి కాపాడిన పోరాట యోధురాలు. చాకలి ఐలమ్మ లాంటి మహనీయులనీ నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఐలమ్మలా అన్యాయాలను అక్రమాలను చేసే వారిని ఎదిరించాలని ఐలమ్మలా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాలని ప్రశ్నించే గొంతుకగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం దేవి, టీచర్స్ శిరీష, గీత, కవిత, రాధిక, సృజన విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

రుణమాఫీ ప్రక్రియను పరిశీలించిన ఏ డి ఏ గౌస్ హైదర్

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

Sambasivarao