Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాగేల్లి వెంకటనారాయణ గౌడ్

*వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాగేల్లి వెంకటనారాయణ గౌడ్*

వరంగల్ జిల్లా//నర్సంపేట టౌన్
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 నర్సంపేట ప్రతినిధి:-

తెలంగాణ సమాజానికి వారు అందించిన సామాజిక ఉద్యమ స్పూర్తిని స్మరించుకుని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పనిచేసి నేటి తరానికి, భవిష్యత్ తరాలకు నిత్య స్ఫూర్తి దాయకంగా నిలిచిన విప్లవ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి. కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసింది. భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గుంటి రజనీ కిషన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ నల్ల మనోహర్ రెడ్డి, డివిజన్ నాయకులు, డా,, విద్యా సాగర్ రెడ్డి, ఎన్నారై సెల్ నాయకులు శానబోయిన రాజకుమార్ బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, జాగృతి జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్, కౌన్సిలర్లు ఎండి పాషా, రామ సాయం శ్రీదేవి సుధాకర్ రెడ్డి, నాయకులు బండి రమేష్, మండల శ్రీనివాసు, వాసం కరుణ, మధ్యబోయిన సాంబయ్య, సంపంగి సాలయ్య, పైస ప్రవీణ్, బి ఆర్ టి యు డివిజన్ నాయకులు కొల్లూరు లక్ష్మీనారాయణ శివరాత్రి స్వామి, మడికొండ నరేందర్, ఎండి ఇర్ఫాన్, ఆబోతు రాజు, బోలె పాషా, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

లడ్డు లక్కీ డ్రాలో 5కేజీ లడ్డు 1 గ్రామ్ గోల్డె ని గెలుచుకున్న ఎర్ర రాధరామయ్య.