*నర్సంపేట వైద్యా కళాశాలలో తరగతుల ప్రారంభానికి సిద్దం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా*
వరంగల్ జిల్లా//నర్సంపేట పట్టణం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 నర్సంపేట ప్రతినిధి:-
ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్.
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతుల ఈ విద్యా సంవత్సరంనుండి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధికారులతో కలసి నూతనంగా నిర్మించిన జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాల నిర్వహణ, ఆస్పత్రిలో సేవలందించేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర మౌళిక వసతులు, పరికరాలు సమకూర్చుకొని ఈ విద్యా సంవత్సరంనుండి వైద్య తరగతులు, వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాలును కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ దాస్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పుష్పలత, టిజిఎం ఐడిసి ఈఈ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.