*నూతన తహసీల్దారును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు*
హన్మకొండ జిల్లా//శాయంపేట మండల కేంద్రం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 పరకాల ప్రతినిధి:-
శాయంపేట నూతన తహాసీల్దారుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కల్వల సత్యనారాయణను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్యర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…. ఎలాంటి పక్షపాతం లేకుండా మండల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తహాసీల్దారుకు సూచించారు. వారి విధి నిర్వహణలో తప్పకుండా తమ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి, మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు మారపెల్లి రవీందర్, చిందం రవి, దుబాసి కృష్ణమూర్తి, వైనాల కుమారస్వామి, నిమ్మల రమేష్, మారపెల్లి కట్టయ్య, తడక కుమారస్వామి, డిటి రెడ్డి, లడే రాజకుమార్, మారపెల్లి వరదరాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు.