*అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల అవసరాల కోసం పనిచేయాలి.. పరకాల ఎమ్మెల్యే*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వరంగల్ ప్రతినిధి:-
అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం విడి ప్రజల అవసరాలకోసం తీసుకొనే నిర్ణయాలను సామాజిక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని అధికారులను పరకాల ఎంఎల్ఏ రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. గీసుగొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్షులు, స్పెషల్ ఆఫీసర్ లు, మండల పరిషత్ అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా జరిగిన, జరగవలసిన అభివృద్ధి పనులపై ఆయా శాఖల వారీగా వివిధ అంశాలతో చర్చించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్ల విధులు భాద్యతలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గత సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఎంఎల్ఏ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం విడి ప్రజల అవసరాలకోసం తీసుకొనే నిర్ణయాలను సామాజిక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని కోరారు.
గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 29 విధులలో 17 విధులు గ్రామ కార్యదర్శులకు, స్పెషల్ ఆఫీసర్ లకు ఉన్నాయని తమ విధులను మరిచి నిర్లక్ష్యం వహిస్తున్న వారి పట్ల తాను కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని హెచ్చరించారు.
ప్రజలకు సేవచేసే బాధ్యత ఉద్యోగుల సామాజిక బాధ్యత అని ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే పనిచేసిన సంతృప్తి ఉంటుందని సూచించారు. ప్రజాపాల నుండి వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, ఆయాల వివరాలను అడిగి తెలుసు కున్నారు. మహాలక్ష్మి & గృహజ్యోతి పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజల్లో ఏమైనా సందేహాలు ఉంటే సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు సేవ చేసి అసలైన అవకాశం అధికారులు ఉంటుందని అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి సంతృప్తి పొందాలని అన్నారు. రాజకీయాల కతీతంగా గ్రామాల అభివృద్దే లక్ష్యంగా తాను కృషి చేస్తానని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని అధికారులు నిర్లక్ష్యం వీడి అభివృద్ధిలో తనకు సహకరించాలని కోరారు.