Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి లెనిన్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగి సురేష్

*ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి లెనిన్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగి సురేష్*

వరంగల్//శంభునిపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వరంగల్ ప్రతినిధి:-

ప్రభుత్వం పేదలకోసం తక్కువ ధరకు కరెంట్ మీటర్లు అందిస్తుంది. దీనిని అందరు ఉపయోగించు కోవాలని లెనిన్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగి సురేష్ అన్నారు. ఈ సందర్బంగా 42వ డివిజన్ లెనిన్ నగర్ కాలనిలో కరెంట్ మీటర్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం నుండీ మీటర్లు కేవలం రూ, 850 మరియు జి ఎస్ టి రూ 70, తో మొత్తం రూ,920/-లకే మీటర్లు ఇస్తున్న కార్యక్రమాన్ని కాలనిలో విధ్యుత్ ఏఈ సంపత్, లైన్ మన్ రఘు లతో ప్రజలకు అవగాహనా కల్పిస్తూ దరఖాస్తులు చేయించడం జరిగింది. అనంతరం ప్రజలను ఉద్దెశించి కాలనీ అధ్యక్షులు బోగి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ప్రవేశ పెట్టిన గృహజ్యోతి ఉచితంగా 200 యూనిట్స్ కరేంట్ పథకం కాలనీ వాసులందరు లబ్ధిపొందాలంటే అందరు మీటర్లు పెట్టుకోవాలని అందుకు ఇప్పుడు ప్రభుత్వం తక్కువ ఖర్చుకే మీటర్లు ఇస్తుందని అందరు సద్వినియోగం చేసుకొని గృహజ్యోతి పథకాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు ప్రవీణ్, కాలనీ అభివృద్ధి కమిటీ ముఖ్య నాయకులు బీమారం యాదగిరి, సూరావు విజయ్, పున్నం సుమన్, వల్లెపు దేవేందర్, మోర గోపాల్, మొగిలి, యాకయ్య, రుద్ర చారి, సంపత్, అశోక్ లతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

చిన్నారులకు పలకల పంపిణి

సిఐ ఎస్సైలకు సన్మానం