*తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మకి ఘనంగా నివాళులర్పించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతలు*
హన్మకొండ జిల్లా//కాకతీయ యూనివర్సిటీ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 కేయూ ప్రతినిధి:-
కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ 39 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక విద్యార్థి వ్యవస్థాపక అధ్యక్షులు కత్తెరపల్లి దామోదర్ మరియు హసన్ పర్తి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండి రజనీ కుమార్ విచ్చేసి పూలమాల సమర్పించిన అనంతరం మాట్లాడుతూ, నిరక్షరాసులైన చిట్యాల ఐలమ్మ ఆనాడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాజేయాలని చూసిన విశ్నూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి పంపిన అనుచరులను తరిమికొట్టిన చరిత్ర నేటి తెలంగాణ సమాజం మర్చిపోలేదని ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ రజక విద్యార్థి సంఘం ఇంచార్జ్ కొరపెల్లి రాజేష్ సీనియర్ నాయకులు పాలమాకుల కొమురయ్య డాక్టర్ ఆరూరి రంజిత్ కుమార్ కందికొండ తిరుపతి ప్రశాంత్, టి ఆర్ వి ఎస్ నాయకులు పోచంపల్లి రఘుపతి, ఐలోని అభిషేక్,. బీసీ సంఘం కే యూ ఇంచార్జ్ నాగరాజు, అనిల్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.