*గత 17 రోజులుగా గీసుకొండలో ఆమరన నిరాహార దీక్ష చేస్తున్న జాపర్తి కుమార్ ఘాడ్గేని నిమ్మరసంఇచ్చి విరమింపజేసిన బండ ప్రకాష్ నరేందర్ గౌడ్ పటేల్ వనజక్క*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వరంగల్ ప్రతినిధి:-
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాసన మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాశ్ తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఏఐఓబిసి జాక్ వైస్ చైర్మెన్ పటేల్ వనజక్క చేతుల మీదుగా ఆమరణ నిరాహార దీక్షను నిమ్మరసంతో విరమింపజేసిన చాపర్తి కుమార్ గాడ్గే. గత 17 రోజులుగా గీసుగొండలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి చాపర్తి కుమారస్వామి చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా దీక్ష విరమింప చేసి ప్రత్యక్ష పోరాటంలో ముందుండి పోరాడుతానని అన్ని ప్రజా సంఘాల ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది గమనించి వారిని అభ్యర్థిస్తే వారు చివరిగా దీక్ష విరమణ ఒప్పుకోవడం జరిగింది. బండా ప్రకాశ్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచి 42 శాతం రిజర్వేషన్ స్టానిక ఎన్నికలలోపే స్పందించి బీసీ ప్రజల్ని రాజ్యాధికారం దిశగా బీసీ ఉద్యమం నడిపించలని 17 వ రోజులుగా ప్రాణాలను ప్రాణంగా దీక్ష చేసిన ఛాపర్తి కుమార్ గాడ్గే త్యాగం గొప్పది బీసీ ఉద్యమానికి రజక పోరు బిడ్డ సమాజంలో బీసీ లకోసం ఎన్నో ఉద్యమాలు. ఈ రోజు చరిత్రలో నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజక్క, ప్రొఫెసర్ డాక్టర్ కొంగ వీర స్వామి, అఖిల భారత మహాత్మ జ్యోతి రావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేడల ప్రసాద్, ఫూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, కొడిపాక దేవిక, బీసీ రైటర్స్ వింగ్ చింతం ప్రవీణ్, చింతం రాజేశ్వరరావు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక హన్మకొండ ఉపాధ్యక్షులు రుద్రోజు నవీన్, వేదిక సలహా దారు దేవేందర్, రాజేష్ ఖన్నా, అరుణ అక్క, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొదీల సాయిబాబా, సద్గుణ, మాదాసి సురేష్, తెలంగాణ కొమురయ్య, రొడ్డ మురళీ కృష్ణ, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యురాలు గుంటుక నవ్య, సింగారపు అరుణ, బీసీ ప్రజా సంఘం నాయకుడు నాయని భరత్ తదితరులు పాల్గొన్నారు.