May 5, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

*కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు*

హన్మకొండ జిల్లా//సుబేదారి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 వర్ధన్నపేట ప్రతినిధి:-

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయంనందు, వరంగల్ మండల పరిధిలోని 3 వ, 14 వ డివిజన్ల పరిధిలోని వివిధ గ్రామాల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు 55 మంది సుమారు 55 లక్షల 6వేల 380 రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసంధర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతోఅండ గాకళ్యాణ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు. 3 వ, 14 వ డివిజన్లలో భూములు ఎవరు కబ్జాలకు పాల్పడిన మా నాయకులైన ఎవరైనా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు కఠిన చర్యలు తీసుకుంటాను హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 కి కాల్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తామని ఈసందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేయడం జరిగింది. ఈ రెండు డివిజన్లలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులుఇవ్వాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 3 వ డివిజన్ కార్పొరేటర్ జున్ను శీభారాణి – అనిల్ కుమార్, 14 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ 3 వ, 14 వ డివిజన్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళానాయకులు యూత్ నాయకులుతో పాటు ఎమ్మార్వో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆత్మహత్యలను నివారించడాన్ని ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. ఎంపీ డాక్టర్ కడియం కావ్య

Sambasivarao

సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర

విధులకు హాజరు కాని హాస్టల్ వార్డెనులను సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ మంద శ్రీకాంత్

Notifications preferences