Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం.-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
కళలను ప్రోత్సహించి కళాకారులకు ప్రోత్సాహన్ని అందిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. కిట్స్ ఆడిటోరియం లో మయూరి నాట్య కళాక్షేత్రం 17 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి నా తల్లి నా దైవం అనే శీర్షికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ పెంచికలపేట గ్రామానికి చెందిన కుండే అరుణ రాజ్ కుమార్ దంపతులు మయూరి నాట్య కళాక్షేత్రాన్ని ప్రారంభించి అనేకమంది విద్యార్థులకు కూచిపూడి భరతనాట్యం నేర్పుతూ కళా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నారని ఆయన అన్నారు . కళా రంగానికి కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. వందలాదిమంది కళాకారులను తయారు చేస్తున్న అరుణ రాజ్ కుమార్ దంపతులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత , రాష్ట్రపతి అవార్డు గ్రహీత వేదాంతం రాదేశాం, సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు సీతాల రాఘవేందర్ చక్రవర్తి హాస్పిటల్ డైరెక్టర్ తరుణ్ రెడ్డి ,కిడ్స్ కాలేజ్ సూపర్డెంట్ పొట్లపల్లి ప్రసాదరావు, మేకల రమేష్, ఆలేటి శ్యాంసుందర్రావు ,
పెండెం వేణుమాధవ్ ,పెరుమాళ్ళ వెంకట్ , భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌

ఆత్మకూరు పంచాయతీకి స్వచ్చ రాష్ట్ర స్థాయి అవార్డు

Jaibharath News

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు ముందంజ

Sambasivarao